ఆర్సీ న్యూస్(హైదరాబాద్): శాఖ లేని మంత్రిగా ఈటెల రాజేందర్ మిగిలారు.వైద్య,ఆరోగ్య శాఖ నుంచి ఈటెల రాజేందర్ ను తొలగిస్తున్నట్లు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ శనివారం ప్రకటించారు. మంత్రి ఈటెల రాజేందర్ భూ భాగోతం..ఈటెల భూ కబ్జా..అంటూ ఈ నెల 30న, తెలుగు ఛానల్స్ లలో ఈటెలకు వ్యతిరేకంగా కథనాలు రావడంతో సీఎం వెంటనే స్పందించారు. ఈటెల భూ కబ్జాల విషయాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్ర ఛీప్ సెక్రటరి సోమేష్ కుమార్ చేత ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. సీఎం ఆధేశాల మేరకు విజిలెన్స్ డీజీ పూర్ణచంద్రరావు, మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్, రెవెన్యూ,పోలీసు అధికారుల బ్రుందాలు రంగంలోకి దిగి శనివారం ఉదయం నుంచే వివాదస్పదంగా మారిన అచ్చంపేట్ భూముల వద్దకు చేరుకుని విచారణ ఫ్రారంభించారు. విచారణ అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లా డుతూ..ఇక్కడ అసైన్డ్ భూములు కబ్జాకు గురైన విషయం వాస్తవమేనని స్పష్టం చేశారు. అసైన్డ్ భూములను కొన్నా..అమ్మినా చట్టరిత్యా నేరమన్నారు. సర్వే నెంబర్ 130 లోని మూడు ఎకరాల భూమిని సీతారామారావు వద్ద నుంచి ఖరీదు చేసి..ఆబిడ్స్ లోని కెనెరా బ్యాంక్ లో రుణం తీసుకున్నారని కలెక్టర్ హరీష్ మీడియాకు తెలిపారు. ప్రాథమికంగా భూ కబ్జా జరిగినట్లు నిర్ధారించిన సంబందిత అధికారుల రిపోర్ట్స్ మేరకు వైద్య,ఆరోగ్య శాఖ నుంచి రాజేందర్ ను తప్పిస్తున్నట్లు సీఎం, గవర్నర్ కు సిఫారస్ చేయడం..గవర్నర్ వెంటనే ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. దీంతో ప్రస్తుతం ఈటెల రాజేందర్ శాఖ లేని మంత్రిగా మిగిలిపోయారు. ప్రస్తుతం వైద్య,ఆరోగ్య శాఖ సీఎం పరిధిలో ఉంటుందని గవర్నర్ కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు.
మూల్యం చెల్లించుకోక తప్పదు: ఈటెల రాజేందర్
తనపై లేనిపోని అభాండాలు వేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్న వారు తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.తనపై వచ్చిన ఆరోపణలపై ఒక్కసారి ముఖ్యమంత్రి తనను పిలిచి వివరణ అడిగితే భావుండేదని ఆయన తెలిపారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని తాను సిద్దమని ఆయన శనివారం మరోసారి స్పష్టం చేశారు. వైద్య,ఆరోగ్య శాఖ నుంచి తనను తొలగిస్తున్నట్లు సమాచారం వచ్చిందని.. మంత్రి వర్గం నుంచి ఎవరినైనా తొలగించే అధికారం ముఖ్యమంత్రికి ఉందని ఆయన అన్నారు. సీఎం విచారణకు ఆదేశించిన సందర్బంగా ఆయా అధికారులు సమర్పించే నివేధికలలో ఏం తేలుతుందో చూద్దాం..తదనంతరం తన కార్యాచరణ ఏంటని చెబుతానన్నారు. తాను ఇప్పటికే సిట్టింగ్ న్యాయమూర్తితో విచారించిన తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తాను ఎవరికి భయపడనన్నారు. ఒకవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తుండగా..ఇప్పడు ఇలాంటి దుమారం లేపడం సరైంది కాదన్నారు. పథకం ప్రకారం స్కెచ్ వేసి ఇదంతా పకడ్బందీగా చేస్తున్నారన్నారు. ఈ విషయంపై తాను ఎవరిని కలువ లేదన్నారు. నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి తప్పలు చేయలేదని..ఇప్పుడు తన క్యారెక్టర్ని దెబ్బతీస్తున్నారన్నారు. ప్రణాలళికాబద్దంగా నాపై విషం చిమ్ముతున్నారన్నారు. అసైన్డ్ భూముల కబ్జా అంటూ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారన్నారు. తాను ఎక్కడా అసైన్డ్ భూములను కబ్జా చేయలేదని.. ఏ విచారణకైన సిద్దమేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు.తాను ఎవరిని మోసం చేయ లేదని..తాను ఎవరికి పడనని..ఎలాంటి విచారణనైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానని ఆయన అన్నారు.
1 thought on “వైద్య,ఆరోగ్య శాఖ నుంచి ఈటెల ఔట్…”