అక్టోబర్ 24, 2021

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

తగ్గేదే..లే అంటున్న అల్లు అర్జున్.

ఆర్సీ న్యూస్ ( హైదరాబాద్): తగ్గేదే..లే..అంటూ పుష్ప సినిమా ద్వారా  కొత్త లుక్ తో ప్రేక్షకుల మందుకు వస్తున్నాడు అల్లు అర్జున్. ఏదైనా అనుకోని సంఘటనలు ఎదురైతే..ఎదుటి వారు ఎవరైన సవాల్ విసిరితే..నేను మాత్రం తగ్గేదే లేదంటూ..సాధారణంగా ధైర్యంగా చెప్పే మాటను అల్లు అర్జున్ నిండా కాన్ఫిడెన్స్ తో చెప్పే డైలాగ్ బన్నీ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయనుంది. ఓర చూపు చూస్తూ..తన కుడి చేతిని గడ్డం కింది నుంచి ఎడమ వైపు అంటూ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల చేత సూపర్బ్ అనిపించక మానదు. ఇప్పటికే ప్రేక్షకుల మనస్సుల్లో స్టైలిష్ గా పేరు తెచ్చుకున్న బన్నీఈ డైలాగ్ తో ప్రేక్షకులను మరింత అలరించనున్నాడు.  

 

  • మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఇప్పటి వరకు చేయని ఒక విలక్షన పాత్ర పోషిస్తున్నాడని చిత్ర దర్శకులు సుకుమార్ తెలిపారు.
  •  బుధవారం రాత్రి నగరంలో జరిగిన అల్లు అర్జున్ జన్మదిన వేడుకల సందర్బంగా ప్రేక్షకుల సమక్షంలో పుష్ప సినిమా విశేషాలను సుకుమార్ వివరించారు.
  •  వాస్తవానికి ఏప్రిల్ 8న, అల్లు అర్జున్ జన్మదినం..కాగా ఒకరోెజు ముందుగా కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. 
  • అల్లు అర్జున్ ఇప్పటి వరకు 20 సినిమాలు నటించడంతో..ఆయా సినిమా పేర్లతో కూడిన 20 కిలోల కేక్ ను ప్రత్యకంగా తయారు చేయించి కట్ చేశారు.
  • ఈ సందర్బంగా సుకుమార్ మాట్లాడుతూ..ఆర్యా సినిమాతో స్టైలిష్ స్టారైన అల్లు..ఈ సినిమాతో పుష్ప ఐకానిక్ స్టార్ అవుతారన్నారు.
  •  అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ..ఏ విషయంలోనైనా తాను తగ్గేదే లేదన్నారు. 
  • అందరి లాగే తనకు భయాలున్నా…ఫెయిలైనా..తాను ఎక్కడా తగ్గేదే లేదంటూ ముందుకు వెళ్తున్నానన్నారు.
  •  అంతేకాదు..అమ్మాయిలు కూడా ఎక్కడా తగ్గేదే లేదన్నారు. 
  •  రాబోయే 25 ఏళ్లలో తమ సినీ పరిశ్రమ ప్రపంచంలోనే అతి పెద్ద ఇండస్ట్రీగా మారుతుందన్నారు.
  •  కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలన్నారు.ఇక తెలుగు ర్యాపర్ రోల్ రైడా గురించి ఆయన మాట్లాడుతూ ఫాదర్ ఆఫ్ తెలుగు ర్యాప్ అనే టైటిల్ ఇస్తున్నట్లు కొనియాడారు.
  •  వెంటనే స్టేజ్ పైకి వచ్చిన రోల్ రైడా అల్లు అర్జున్ కు పాదాభివందనం చేశారు.
  •  తనను అభిమానిస్తున్న ప్రేక్షకులందరికి తెలుగు,హిందీ,ఇంగ్లీష్ భాషల్లో ధన్యవాదాలు తెలిపారు. 
  • గతంలో రిలీజ్ చేసిన 19 సెకండ్ల వీడియోలో అల్లు అర్జున్ ఫెస్ కనిపించకుండా రిలీజ్ చేసారు.
  •  ప్రస్తుతం ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో అల్లు అర్జున్.. నీళ్లలో ద్విచక్ర వాహానం నడుపుతూ కనిపించే స్లో మోషన్ సీన్ తో ఆకట్టుకుంటున్నాడు.