areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

మాస్క్ లపై రంగంలోకి దిగిన పోలీసులు..కరోనా కట్టడికి చర్యలు

మాస్క్ లేకుంటే రూ. వెయ్యి జరిమాన…

మాస్కలపై రంగంలోకి దిగిన పోలీసులు..

ఆర్సీ న్యూస్( హైదరాబాద్): కరాోనా పాజిటివ్ కేసులు రోెజురోెజుకు పెరుగుతున్నాయి. మాస్క్ లను విరివిగా వినియోగించకపోతే పరిస్థితులు మరింత అదుపు తప్పనున్నాయి. రాబోయే నాలుగు వారాల్లో పాజిటివ్ కేసులు మరిన్ని పెరిగే అవకాశాలున్నాయి. ముఖాలకు మాస్క్ లు ధరించి.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే..మన రాష్ట్రం కూడా మరో మహారాష్ట్ర అవుతుందని సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు చెప్పిన విషయం తెలిసిందే. దేశంలో వారం పది రోజుల క్రితం కేవలం లక్ష కేసులు మాత్రమే నమోదు కాగా..ప్రస్తుతం రోజుకు రెండు లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఇక రాష్ట్రంలో కూడా రోజు వారి కేసులు అధికమవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 3307 పాజిటివ్ కేసులు నమోదై ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 446 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే రెండు వందలకు పైగా మూడు జిల్లాల్లో నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 314, నిజామాబాద్ లో 279, రంగారెడ్డి జిల్లాలో 277 కేసులు నమోదయ్యాయి. ఏపీలో 5 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో కరోెనా మరణాలు సంభవిస్తున్నాయి.

పట్టించుకోని యువతరం..రంగంలోకి పోలీసు యంత్రాంగం

 పరిస్థిలతులు ఇంత భయాందోళనలు కలిగిస్తుండగా.. యువతరం పట్టించుకోవడం లేదు.  ఒకవైపు కేసులు భారీగా నమోదవుతుండగా… మరోవైపు కొంత మంది యువకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న యువకులు మాస్క లు ధరించడం లేదు. తమ తమ ద్విచక్ర వాహనాలపై రయ్యి మంటూ ముందుకు  దూసుకెళ్తున్నారు. కొంత మంది యువకులకు కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ..వైరస్ లక్షణాలు లేకపోవడంతో యధేచ్చగా రోడ్లపై ఉరుకులు పరుగులు తీస్తున్నారు. వారిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉండడంతో వారికి ఏమి కావడం లేదు. అయితే వారికి క్లోజ్ గా మూవ్ ఐన వారికి మాత్రం కరోనా అంటుకుంటోందని వైద్యలు చెబుతున్నారు. కాగా, సెకండ్ వేవ్ లో యువకులు సైతం కరోనా వైరస్ బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నసంఘటనలున్నాయి. ప్రతి ఒక్కరూ మాాస్క్ లు ధరించేటట్లు తగిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. 

కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించిన పోలీసులు..

కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించిన పోలీసులు..

కరోనా వైరస్ వ్యాప్తి పై హైదరాబాద్ పోలీసు కమీషనరేట్ తో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు గత వారం పది రోజులుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సమావేశాలను ఏర్పాటు చేసి కౌన్సిలింగ్

చేశారు. ఎట్టిపరిస్థితుల్లో మాస్క లు లేకుండా బయటికి రాకపోవడంతో పాటు భౌతిక దూరం పాటించాలని కోరారు. రద్దీ ఎక్కువగా ఉండే చోటుకు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. ఇక చిరు వ్యాపారులు తప్పని సరిగా మాస్క లు ధరించాలని..తరచూ శానిటైజర్ వాడాలని కోరారు. డబ్బులు వినియోెగదారులకు ఇచ్చేటప్పడు..తిరిగి తీసుకున్నాక తప్పని సరి చేతులకు శానిటైజర్ వాడాలని కోరారు. ఇలా గత కొన్ని రోజుల వరకు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో సమావేశాలు, ప్రదర్శనలు సూతం నిర్వహించి స్థానికులకు అవగాహన కలిగించారు. 

మాస్క్ లేకుంటే రూ. వెయ్యి జరిమాన…

అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని స్తానిక పోలీసులు రోడ్లపైకి వచ్చి మాస్క్ లు ధరించని వారిని గుర్తించి ఛలానాలు విధిస్తున్నారు. మాస్కలు లేకుంటే రూ. 1000 జరిమాన విధిస్తున్నారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో తనిఖీలను ముమ్మరం చేశారు. ట్రాఫిక్ పోలీసులైతే మాస్క్ లతో పాటు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ద్రుష్టి సారించారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు మాస్క్ లపై ద్రుష్టి సారించారు. బైక్ లపై దూసుకొచ్చే వారిని గుర్తించి వెయ్యి రూపాయల ఈ‌‌‌-ఛలానా విధిస్తున్నారు. టెలిఫోన్ నెంబర్ ఆధారంగా ఈ- ఛలాన్ మెసెజ్ పంపిస్తున్నారు. మీ సేవా, ఈసేవా కేంద్రాల్లో ఛలానాలను చెల్లించాల్సి ఉంటుంది.