ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

Coronavirus Omicron hyderabad : కరోనా వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు అవసరం: హైకోర్టు

Coronavirus Omicron hyderabad : కరోనా వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు అవసరం: హైకోర్టు
 • రోజుకు లక్ష ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు చేయాలి 
 • భౌతిక దూరంతో పాటు మాస్కులు ధరించేటట్లు చర్యలు తీసుకోవాలి 
 • కరోనా కేసులు పెరుగుతుండటంతో 
 • హైకోర్టులో తిరిగి విచారణలు ఆన్లైన్లోనే.. 
 • ఇకనుంచి వర్చువల్ విచారణలు

ఆర్సీ న్యూస్, జనవరి 17 (హైదరాబాద్): రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఆంక్షల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రతి రోజు నిర్వహిస్తున్న ఆర్ టి పి సి ఆర్ పరీక్షలను లక్షకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకోవడంతో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏజీ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో క్యాబినెట్ మీటింగ్ జరుగుతోందని వివరించారు. ఇదిలా ఉండగా హైకోర్టు విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 20వ తేదీ వరకు ఆంక్షలను పొడిగించిన ప్రభుత్వం.. విద్యాసంస్థల అన్నింటికీ ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక సోమవారం జరిగే క్యాబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు ఉండవచ్చునని భావిస్తున్నారు.

 Coronavirus Omicron hyderabad : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ..

 • ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..
 • రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలన్న హైకోర్టు
 • ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశం
 • భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
 • కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమన్న హైకోర్టు
 • కరోనా నియంత్రణపై ఇవాళ మంత్రివర్గం చర్చిస్తున్నట్లు ఏజీ వెల్లడి
 • పూర్తివివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
 • హైకోర్టులో రేపట్నుంచి వర్చువల్‌గా కేసుల విచారణ
 • ఆన్‌లైన్‌లోనే పూర్తిస్థాయి విచారణలు చేపట్టనున్న హైకోర్టు
 • కొవిడ్‌ వ్యాప్తి వల్ల మళ్లీ వర్చువల్‌ విచారణలు జరపనున్న హైకోర్టు
 • తదుపరి విచారణను ఈ నెల 25 కు వాయిదా వేసిన హైకోర్టు.