మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

 దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడాలి: దేశ ప్రధాని నరేంద్ర మోడీ 

దేశ ప్రధాని నరేంద్ర మోడీ

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను కోరారు. దేశంలో లాక్ డౌన్ పెట్టలేమని..లాక్ డౌన్ అనేది చివరి అస్త్రంగా ఉండాలన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ లేకుండానే తగిన ముందు జాగ్రత్త చర్యలు అవసరమన్నారు. మంగళవారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి పీఎం నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు, సలహాలు,ఆదేశాలు జారీ చేశారు.  కరోనా మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడమే కాకుండా దేశాన్ని కాపాడడం కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిపై ఉందన్నారు. ఈ విషయంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తగిన శ్రద్ధ వహించాలన్నారు.

మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల వయస్సు నుంచి టీకా పంపిణీ..

ఇప్పటి వరకు 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ అందజేశామని..మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల వయస్సు నుంచి టీకా పంపిణీ జరుగుతుందని ప్రధాని అన్నారు.  దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని..అంతే వేగంగా దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతుందన్నారు.కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ..దేశంలో మరోసారి లాక్ డౌన్ ఉండదన్నారు. కొంత మంది కరోనా టీకాలను తీసుకోవడానికి వెనకడుగు వేయడం సరైంది కాదన్నారు. అయినప్పటికీ టీకా పంపిణీ జోరుగా కొనసాగుతుందన్నారు. ఒక్కరోజులో 40 లక్షల మందికి వాక్సినేషన్ జరుగుతోందన్నారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల వారికి కూడా వాక్సినేషన్ కొనసాగుతుందన్నారు. గతేడాది కరోనా మహమ్మారిని పకడ్బందీగా ఎదుర్కొన్నామని..ఈ ఏడాది కూడా కరోనా కట్టడికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం యువతరం ముందుకు రావాలన్నారు.  

కరోనా కట్టడికి చిన్న చిన్న కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలి… 

కరోనా కట్టడికి చిన్న చిన్న కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తే ఆశించిన ఫలితాలుంటాయని ప్రధాని అన్నారు. యువత తలుచుకుంటే సాధించలేనిదేదీ లేదని కరోనా కట్టడికి వారి సేవలు ఎంతో అవసరమన్నారు. ఒక వైపు వాక్సినేషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతుండగా..వైరస్ వ్యాప్తి కూడా అంతకన్నా వేగంగా ఉందన్నారు. ఇందుకు కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మేనన్నారు.కరోనా కట్టడికి అవసరమైన ముందు జాగ్రత్తలు ఎంతో అవసరమన్నారు. చిన్న చిన్న కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు పై దృష్టి సారించాలన్నారు. ఆయా మైక్రో కంటైన్మెంట్ జోన్లలోని అన్ని కుటుంబాలలోని వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలన్నారు. కరోనా టీకా తీసుకున్నాక కూడా కరోనా వైరస్ కట్టడి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మాస్క్ లతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా కొత్త ఫ్లాంట్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 

దేశం అతి పెద్ద యుద్దం చేస్తోంది…

దేశం అతి పెద్ద యుద్ధం చేస్తోందని..దేశ ప్రజలు మనోధైర్యం వీడకుండా కరోనాతో యుద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కట్టడికి చిన్న చిన్న కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాల్పిన అవసరం ఉందని నరేంద్ర మోదీ అన్నారు. అత్యవసర పరిస్థితులుంటేనే..ఇళ్ల నుంచి బయటికి రావాలని ఆయన మరోసారి దేశ ప్రజలను కోరారు. గతేడాది కరోనా కట్టడికి కొంత ఇబ్బందులు తలెత్తే నప్పటికీ..ఈసారి అలాంటి పరిస్థితులు లేవన్నారు. టెస్టులతో పాటు చక్కటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నామన్నారు. కరోనాతో మనం చేస్తున్న యుద్ధంలో మనమే గెలవడానికి పోరాటం చేయాలన్నారు. యుద్దం గెలవడం కోసం ఎంతటి పోరాటానికైనా మనం సిద్ధమేనన్నారు. ధైర్యంగా ఎదుర్కందామన్నారు. ఈరోజు నవరాత్రి చివరి రోజు..రేపు శ్రీరామ నవమి..మనకు అంతా మంచే జరుగుతుం దన్నారు. ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం కొనసాగుతుందని..రంజాన్ మొదలై ఈరోజుేకు ఏడు రోజులు అవుతుందని…ధైర్యం, ఆత్మస్థైర్యం లభిస్తుందన్నారు.