ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రాజన్న రాజ్యం కోసం మీ ముందుకు వస్తున్నా: వై.ఎస్.షర్మిల

వై.ఎస్.షర్మిల

ఆర్సీ న్యూస్(ఖమ్మం): ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ వైఎస్సార్ అభిమానులకు తెలంగాణ బిడ్డగా…రాజన్న రాజ్యం కోసం మీ ముందుకు వస్తున్నానంటూ వై.ఎస్.షర్మిల శుక్రవారం రాత్రి ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించింది.  గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలను వేడిక్కిస్తున్న  వై.ఎస్. షర్మిల ఎట్టకేలకు ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ప్రథమ శ్రేణి రాజకీయ నాయకులు అంతగా లేకపోయినప్పటికీ..ఖమ్మం బహిరంగ సభ విజయవంతం అయ్య్యిందని ఆమె అభిమానులు అంటున్నారు. వై.ఎస్. షర్మిల చేసిన రాజకీయ ప్రసంగం తమను ఎంత గానో ఆకట్టుకుదని సంబరపడుతున్నారు. తాను ముమ్మాటికి తెలంగాణ బిడ్డనని..ఇక్కడే పెరిగా..ఇక్కడే చదివా..ఇక్కడి గాలి పీల్చా..కొడుకు,కూతుర్నీ కన్నాను..బరా బర్ తెలంగాణలోె నిలబడతా..తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతా.. ఆదరిస్తే నమ్మకంగా సేవ చేస్తా…అంటూ ఆమె చేసిన ప్రసంగానికి అభిమానులు చప్పట్ల వర్షం కురిపించారు. తాను తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పాలక పక్షాన్ని ప్రశ్నించడానికే తాను పార్టీ పెడుతున్నానన్నారు. ఈ బహిరంగ సభలో ఆమె కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. బంగారు తెలంగాణ ఎక్కడంటూ ప్రశ్నించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలేమాయేనని అడిగే ప్రతి పక్షమే ఇక్కడ లేదన్నారు. టీఆర్ఎస్ చెబితే.. బీజేపీ పంపితే..కాంగ్రేస్ కోరితే..తాను రాజకీయాలకు రాలేదని ఆమె స్పష్టం చేసారు. అసలు సడెన్ గా షర్మిల పొలిటికల్ ఎంట్రీ ఏంటనీ..ఆమె తెర వెనుక ఎవరున్నారు..అనే అనుమానాలకు తెరదించారు. రాజన్న రాజ్యం కోసం ఒంటరిగానే వస్తున్నాని..సింహాం ఎప్పుడు సింగిల్ గానే వస్తుందని ఆమె ధీామా వ్యక్తం చేసారు. అన్ని రంగాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్య,ఉద్యోగ,రైతు,మహిళా వ్యతిరేక విధానాలపై ఆమె విరుచుకుపడ్డారు. వైఎస్సార్ రామ రాజ్యం మళ్లీ తీసుకురావడం కోసం రాజన్న భాణంగా మీ ముందుకు వస్తున్నానన్నారు. పార్టీ ప్రారంభంతో పాటు కేసీఆర్ తప్పిదాలు, విధివిధానాలు,ఫెయిల్యూర్స్ తదితర వివరాలు, ఆమె కార్యాచరణను ఆమె మాటల్లోనే..ఇలా ఉన్నాయి.

 • వైఎస్సార్ జయంతి సందర్బంగా జులై 8న,తెలంగాణలో వైఎస్సార్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం.
 • అదే రోజు పార్టీ పేరు..జెండా..పార్టీ విధివిధానాలను ప్రకటిస్తాం.
 • వైఎస్సార్ 18 ఏళ్ల క్రితం ఏప్రిల్ 9న, చేవెళ్ల నుంచి పాదయాత్ర నిర్వహించాడని..అందుకే ఇదే రోజు ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా ఆయన అభిమానులకు దగ్గరయ్యాను.
 • రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ఉందని..నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని..వీరిని కాపాడడం కోసం వారి తరఫున ఆందోళనకు సిద్దం.
 • రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ భర్తీ కోసం నోటిఫికేషన్ వేసేంత వరకు ఈ నెల 15 నుంచి 3 రోజలు పాటు హైదరాబాద్ నగరంలో నిరాహార దీక్ష చేస్తా.
 • 4వ రోజు నుంచి అన్ని జిల్లాల్లో ప్రతి రోజు అక్కడి నాయకులు,కార్యకర్తలు నిరాహార దీక్షలు చేస్తారు.
 • రాష్ట్రంలో కేసీఆర్ ఆడిందే ఆట..పాడిందే పాటగా నడుస్తోందని…దొర చెప్పిందే వేదం..దొరా నీ భాంచెన్ అని సాగిల పడే నాయకులే ఇక్కడ ఎక్కువయ్యారని..ఎమ్మెల్యే,ఎంపీ, మంత్రులకు కనీసం కలవడానికి అపాయింట్మెంట్ సహితం ఇవ్వడం లేదు. ఇక ఆయనను ప్రశ్నించే వారేవరూ..
 • అందుకే పాలక పక్షాన్ని ప్రశ్నిచడానికే మనం పార్టీ పెడుతున్నాం.
 • రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. నడిరోెడ్డుపై పట్టపగలు న్యాయవాదుల దంపతులను హత్య చేస్తే..అడ్డుకునే పోలీసు వ్యవస్థ లేదు.
 • పోడు భూములపై పోరాడుతున్న గిరిజన మహిళ దుస్తులను తొలగించి చెట్టుకు కట్టి చిత్ర హింసలు పెడితే కాపాడే దిక్కు లేదు.
 • 5 ఏళ్లలో వైఎస్సార్ పేదలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 46 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తే..అప్పటి కేంద్ర ప్రభుత్వం కేవలం 45 లక్షల ఇల్లు మాత్రమే కట్టించింది.
 • ఇక్కడ కేసీఆర్ 5 ఏళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించారు.
 • ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఏమాయే..?
 • పేదలకు వైఎస్సార్ 6 లక్షల ఎకరాల భూమి పంచారు..అలాగే గిరిజనులకు 6 లక్షల ఎకరాల పోడు భూములను పంచారు.
 • కేసీఆర్ ఎంత మంది పేదలకు భూములు పంచారు..?
 • వైఎస్సార్ హయాంలో రూపకల్పన చేసిన  ప్రాణహిత ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కమిషన్ల కోసం ఏకంగా రూ. 1,30,000 కోట్లకు పెంచారు.
 • పావలా వడ్డీ రుణాలు లేవు..రైతులకు రుణ మాఫీలు లేవు..విద్యార్థులకు ఉచిత విధ్య లేదు..కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు లేవు.
 • వీటన్నింటిని తిరిగి ప్రజలకు అందజేయడానికి రాజన్న రాజ్యం అవసరం.
 • అందుకే పార్టీ పెడుతున్నాం.
 • రాజన్న అడుగు జాడల్లో నడిచేందుకే నా బిడ్డ మీ ముందుకు వస్తోంది..ఆదరించండి..అంటూ వైఎస్ విజయలక్ష్మీ సభా వేదిక ద్వారా తెలంగాణ ప్రజలను కోరారు.