areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

బీఎస్పీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారం..

బీఎస్పీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారం..
  • ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి.. 
  • ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తాం..
  • నిరుద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ నిరంకుశ వైఖరి నశించాలి..
  • మిర్యాలగూడలో డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

ఆర్సీ న్యూస్, అక్టోబర్ 27 (మిర్యాలగూడ): రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులు అందరికీ జీవనోపాధి తో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మిర్యాలగూడ పట్టణంలో నిరుద్యోగ సంఘీభావ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వివిధ శాఖలు,ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో నిరుద్యోగులకు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. నిరుద్యోగులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంకుశ వైఖరిని వీడాలన్నారు. ప్రభుత్వం సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో 54 మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మరణించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెరాస ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని నిరు ద్యోగులకు పిలుపునిచ్చారు. 

రాష్ట్రంలో బిఎస్పీ అధికారంలోకి వస్తే… ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు ప్రవేశపెడతామన్నారు. నిరుద్యోగుల ఎవరు ఆత్మహత్యలకు పాల్పడ కూడదని…బహుజన రాజ్యంలో  ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రతి ఏటా క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. తదనంతరం పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు బిఎస్పీ పార్టీలో చేరారు. నిరు ద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో టీఆరెస్ ప్రభుత్వం తీవ్రంగా విపల మైందని ఆయన ఆరోపించారు.