నవంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

అమ్మో..! మళ్లీ కొత్త వైరస్ అట..ఈ వైరస్ మహా డేంజర్ అంటున్నారు.

అమ్మో..! మళ్లీ కొత్త వైరస్ అట..ఈ వైరస్ మహా డేంజర్ అంటున్నారు.
  • గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాపిస్తోందనీ చైనాలోని ఊహాన్ శాస్త్రవేత్తల వెల్లడి.
  • ప్రస్తుతం ఈ వైరస్ సౌత్ ఆఫ్రికా లో వెలుగు చూసిందని చెబుతున్నారు.
  • దీనిని రష్యన్ న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్ వెల్లడించింది. 
  • ప్రతి ముగ్గురిలో ఒకటి మరణం అంటూ స్పష్టం చేసింది. 
  • నియోకోవ్ కొత్త రకం వైరస్ తో మరణాలు అధికం
  • వుహాన్ శాస్త్రవేత్తల బృందం హెచ్చరిక..
  • ఇది కొత్తది కాదని. 2012- 2015  మధ్యకాలంలో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో వెలుగు చూసిందని చెబుతున్నారు.

ఆర్సీ న్యూస్, జనవరి 28 (న్యూ ఢిల్లీ): ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పట్టిపీడిస్తున్న సమయంలో మరో కొత్త రకం వైరస్ వెలుగు చూసిందనే వార్తలు వెలువడటంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి తో తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలకు మరో కొత్త వైరస్ వెలుగు చూడటం పట్ల ఆందోళన చెందుతున్నారు.

  • ప్రస్తుతం ఈ వైరస్ దక్షిణాఫ్రికా దేశంలో కనిపించిందని చైనాలోని వూహాన్ శాస్త్రవేత్తల బృందం తేల్చి చెబుతోంది.
  • దీనిని రష్యన్ న్యూస్ ఏజెన్సీ అయిన స్పుత్నిక్ కూడా స్పష్టం చేస్తోంది.
  • వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అని చెబుతోంది.
  • ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త రకమైన వైరస్ కారణంగా మరణాలు అధికంగా ఉంటాయని అంటున్నారు.
  • ముగ్గురు వైరస్ బారిన పడితే అందులో ఒకరు తప్పనిసరిగా మృతిచెందుతారని అంటున్నారు.
  • ప్రస్తుతం దక్షిణాఫ్రికా దేశంలోని గబ్బిలాల ద్వారా మానవ శరీరంలోకి సోకుతుందని అంటున్నారు.
  • అయితే ఈ వైరస్ కొత్తదేమీ కాదని.. మిడిల్ ఈస్టర్న్ కంట్రీలలో 2012-2015 మధ్య వెలుగు చూసిందంటున్నారు.
  • ప్రస్తుతం కరోనా వైరస్ తో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు ఈ వైరస్ ఆందోళన కలిగిస్తోంది.
  • అయితే దక్షిణాఫ్రికాలో కనిపించినట్లు చెబుతున్న ఈ వైరస్ పై డబ్లూహెచ్ఓ నుంచి ఇంకా నిర్దిష్టమైన ప్రకటన వెలువడ లేదని తమ దేశ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు అంటున్నారు.

మళ్లీ కొత్త వైరస్ : మార్చి నెలాఖరులోగా తగ్గనున్న వైరస్ ప్రభావం..

  • కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ..మార్చి నెలాఖరుకల్లా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గుతుందంటున్నారు.
  • ప్రస్తుతం పనికిరాని వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. మరణాల సంఖ్య స్వల్ప మేనని.. కరోనా వైరస్ సోకిన వారం, పది రోజుల్లో ప్రజల ఆరోగ్యం చక్కబడుతుందని ప్రజా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
  • కొత్త వైరస్ పై ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించ లేదంటున్నారు.

మళ్లీ కొత్త వైరస్ దక్షిణాఫ్రికా లో నియోకోవ్..కొత్త రకం వైరస్

 దక్షిణాఫ్రికా దేశంలో వెలుగుచూసిన నియోకోవ్ కొత్త కరోనా వైరస్ వల్ల అధిక మరణాలు సంభవిస్తాయని వుహాన్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.నియో కోవ్ కొత్త కరోనా వైరస్ సంక్రమణ రేటు కూడా అధికంగానే ఉంటుందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన వుహాన్ యూనివర్శిటీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోఫిజిక్స్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.నియోకోవ్ వైరస్ మొదట దక్షిణాఫ్రికాలో గబ్బిలాల్లో కనుగొన్నారు. జంతువుల ద్వారా ఈ వైరస్ మనుషులకు సంక్రమించిందని వుహాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

నియోకోవ్ వైరస్ సోకిన ముగ్గురిలో ఒకరు మరణిస్తారని..ఈ కొత్త రకం వైరస్ కు అధిక ప్రసార రేటు ఉందని స్పుత్నిక్ వుహాన్ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ కొత్త వైరస్ పై చైనా జరిపిన పరిశోధనల గురించి తమకు తెలుసని రష్యన్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీకి చెందిన పరిశోధకులు చెప్పారు.