areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రాష్ట్రంలో పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో తెలపాలన్న హైకోర్టు..

రాష్ట్రంలో పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో తెలపాలన్న హైకోర్టు..

school reopening in telangana-2022

  •  స్పష్టంగా కోర్టుకు నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ. 
  • రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ..
  •  సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం..
  •  వారాంతవు సంతల్లో కోవిడ్ జాగ్రత్తలపై నివేదిక సమర్పించాలని ఆదేశం..
  •  ఈ నెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తున్నారో..లేదో చెప్పాలన్న హైకోర్టు
  •  పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ప్రభుత్వ న్యాయవాది
  •  పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశం..

ఆర్సీ న్యూస్, జనవరి 28 (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు ఎప్పటి నుంచి తెరుస్తారో.. కోర్టుకు స్పష్టం చేయాలని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తి..ఆరోగ్య పరిస్థితులపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం శుక్రవారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి తీర్చుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలతో పాటు ఈనెల 31వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరుస్తున్నారో లేదో తెలియజేయాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మూడు రోజుల్లో నిర్దిష్టమైన సమాచారాన్ని తెలియజేయాలని ఆదేశించింది. ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను ఈ నెల 30వ తేదీ వరకు సెలవు దినాలుగా విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే

రాష్ట్రంలో పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారు

  • వైద్య విద్య (ఎంబీబీఎస్) తప్పా.. మిగిలిన అన్ని రకాల విద్యాబోధనలో నిలిచిపోయాయి.
  •  అయితే పాఠశాలలో ఆన్లైన్ పాఠాలు కొనసాగుతున్నాయి.
  •  అంతేకాకుండా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలు ఈనెల 31 వ తారీకు వరకు పొడిగించింది.
  • కాగా 30వ తేదీ తో ఆంక్షలతో పాటు పాఠశాలలకు సెలవులు పూర్తవడంతో ఈనెల 31వ తేదీ నుంచి పాఠశాలలు తెరుస్తున్నారా..? లేదా..? అనే విషయాన్ని స్పష్టం చేయాలని హైకోర్టు ధర్మాసనం కోరింది. 
  •  దీనిపై హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది బదులు ఇస్తూ.. ఇప్పటివరకు పాఠశాలల పునఃప్రారంభం పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
  •  దీంతో హైకోర్టు స్పందిస్తూ వెంటనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

 సమ్మక్క సారక్క జాతర పై తీసుకుంటున్న చర్యలు ఏమిటి: హైకోర్టు

  • ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు.. అంటే మూడు రోజుల పాటు జరిగే సమ్మక్క సారక్క జాతర కోసం చేపట్టిన చర్యలను కోర్టు ప్రశ్నించింది. 
  •  లక్షల్లో భక్తులు ఈ జాతరలో పాల్గొంటారని..ఇందుకోసం తీసుకుంటున్న చర్యలు కోర్టుకు తెలపాలంటూ ధర్మాసనం సూచించింది.
  •  దాదాపు 75 లక్షల నుంచి ఒక కోటి వరకు భక్తులు ఈ జాతరలో పాల్గొంటారని.. కరోనా వైరస్  వ్యాప్తి వేగంగా జరుగుతున్న సమయంలో జాతర సందర్భంగా తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు ఏమిటో తెలపాలంటూ ఓ న్యాయవాది హైకోర్టులో వేసిన పిల్ పై శుక్రవారం విచారణ జరిగింది.
  •  దేశంలో సెకండ్ వేవ్ సందర్భంగా నిర్వహించిన కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు గంగా నదిలో స్నానం చేశారని..కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా ఎంతోమంది చని పోయారని వారి మృతదేహాలను సైతం గంగానదిలో బయటపడ్డాయని.. న్యాయవాది తాను వేసిన పిల్లో ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
  •  గతంలో జరిగిన కుంభమేళా..లాగే సమ్మక సారక్క జాతర జరుగనుందని.. ఇందు కోసం ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు ఏమిటో తెలపాలని పిల్ లో కోరారు.
  • ఇందుకు సంబంధించిన వివరాలను పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కోర్టుకు స్వయంగా హాజరై తెలియజేయాలని ఆదేశించింది.
  • తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.

ఆన్ లైన్ విచారణకు హాజరైన డీహెచ్ డాక్టర్ శ్రీనివాస్ రావు

  •  రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందన్నారు.
  •  ఇప్పటి వరకు 77 లక్షల ఇళ్లల్లో జ్వరం చేసి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామని డాక్టర్ శ్రీనివాస్ రావు కోర్టు కు తెలిపారు.
  • కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవన్న న్యాయవాదులు..
  • దీనికి డాక్టర్ శ్రీనివాస్ రావు వివరణ ఇస్తూ..పిల్లలకు మందులు కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదన్న డీహెచ్
  • మూడు రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం..
  • కరోనా పరిస్థితులపై విచారణను ఫిబ్రవరి 3వ తేదీ కి వాయిదా వేసింది.
  • వచ్చే నెల 3వ తేదీకి వాయిదా పడిన విచారణ రోజు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్వయంగా హాజరు కావాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
  • సమ్మక్క-సారక్క జాతరపై తీసుకుంటున్న చర్యలను కోర్టుకు నివేదించాలని కోరింది.
  • ఏ ఏ చర్యలు తీసుకుంటున్నారో
  • స్పష్టంగా తెలియజేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.