ఆర్సీ న్యూస్(హైదరాబాద్): మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూ వివాదం కేసులో హైకోర్టు సీరియస్ అయ్యింది. రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తి అవుతుంది.. సర్వే నిర్వహించిన అధికారులు కార్లో కూర్చుని రిపోర్టులు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు కనిపిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. ఎవరిపైనైతే ఫిర్యాదులు అందాయో.. వారికి తెలియజేయకుండా..సర్వే చేస్తారా..ఫిర్యాదు వస్తే ఎవరి ఇంట్లోకి వెళ్లైన విచారణ చేయోచ్చా..? అని ప్రభుత్వం తరపున ఏజీ (అడ్వోకేట్ జనరల్) ప్రసాద్ ను ప్రశ్నించింది. మెదక్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఏదీ చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈటెల రాజేందర్ కుటుంబం హైకోర్టులో వేసిన అత్యవసర పిటీషన్ పై జరిగిన విచారణలో హైకోర్టు ఏజీ పై పలు ప్రశ్నలను వేసింది. తమ భూములపై సర్వే చేసే ముందు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని..అధికారులు తమ భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని.. విచారణ అనంతరం కలెక్టర్ నివేదిక కూడా తమకు ఇవ్వ లేదని ఈటెల రాజేందర్ కుటుంబం తమ తరఫున న్యాయవాది ద్వారా హైకోర్టు కు తెలిపింది. వెంటనే స్పందించిన ధర్మాసనం సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా..అని ప్రశ్నించింది. అచ్చంపేటలో రెవెన్యూ అధికారులతో పాటు విజిలెన్స్ అధికారులు నిర్వహించిన సర్వేతో పాటు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి అందజేసిన నివేదిక చట్ట ప్రకారం జరగలేదని..అందుకే కలెక్టర్ నివేదిక చెల్లదని స్పష్టం చేసింది. ఫిర్యాదులు వచ్చినప్పుడు వెంటనే నోటీసులు అందజేసి విచారణ జరిపించాలని పేర్కోంది. చట్ట ప్రకారం నిర్వహించే విచారణలు చెల్లుబాటు అవుతాయని..ఇప్పటి వరకు జరిగిన దానిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈటెల భూముల్లో సర్వే జరపడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. అన్ని నియమ నిభంధనలు పాటిస్తూ తిరిగి విచారణ నిర్వహించాలని ఆదేశించింది. చట్టాన్ని పరిగణలోకి తీసుకుని సరైన విధంగా వారికి నోటీసులు జారీ చేసి అవసరమైన సమయం ఇచ్చివిచారణ చేయాలంది. శుక్రవారం నోటీసులు ఇచ్చి సోమవారం సమాధానం ఇవ్వాలని కోర వద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను హైకోర్టు జూలై 6వ తేదీకి వాయిదా వేసింది.
ఈటెల ఎపిసోడ్..ఐదవ రోజు..హైకోర్టు సీరియస్
ఏప్రిల్ 30వ తేదీన మొదలైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూ వివాదం మంగళవారం కోర్టు మెట్లు ఎక్కింది. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ భూముల్లోకి అధికారులు అక్రమంగా ప్రవేశించడం..విచారణ చేయడం..తదితర అంశాలు చట్ట ప్రకారం జరగ లేదని ఈటెల రాజేందర్ కుటుంబం హైకోర్టును ఆశ్రయిచండంతో వారికి అనుకూలంగా కోర్టు స్పందించింది. ఈటెల రాజేందర్ భూ వివాదం ఎపిసోడ్ వరుసగా ఐదో రోజు కొనసాగింది. ఈ ఐదు రోజుల్లో ఏమేమి..ఎలా జరిగాయో..ఒకసారి పరిశీలిస్తే…భూ భాగోతం..ఈటెల భూ కబ్జా..అంటూ ఏప్రిల్ 30న, తెలుగు ఛానల్స్ లలో ఈటెలకు వ్యతిరేకంగా కథనాలు రావడంతో సీఎం వెంటనే స్పందించి ఈటెల భూ కబ్జాల విషయాలపై రాష్ట్ర ఛీప్ సెక్రటరి సోమేష్ కుమార్ చేత ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు విజిలెన్స్ డీజీ పూర్ణచంద్రరావు, మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్, రెవెన్యూ,పోలీసు అధికారుల బ్రుందాలు రంగంలోకి దిగి మే 1న (శనివారం) ఉదయం నుంచే వివాదస్పదంగా మారిన అచ్చంపేట్ భూములపై విచారణ ప్రారంభించి అసైన్డ్ భూములు కబ్జాకు గురైన విషయం వాస్తవమేనని ప్రాథమికంగా నిర్ధేశించి తమ నివేదికలను సీఎం కేసీఆర్ కు అందజేశారు. దీంతో మే 1న, ఈటెల రాజేందర్ వైద్య,ఆరోగ్య శాఖ నుంచి తప్పిస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. ఆ వెంటనే విచారణకు సంబంధించి పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందడంతో మే 2న, ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేశారు. వీటన్నింటిపై మే 3న ఉదయం ఈటెల రాజేందర్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతుండగా..దేవరయంజాల్ సీతారామస్వామి దేవాలయ భూముల ఆక్రమణ అంశం తెరపైకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు దేవర యంజాల్ భూములపై విచారణ నిర్వహిస్తున్నారు. వీటన్నింటిపై ఈటెల కుటుంబం హైకోర్టును ఆశ్రయించడంతో..హైకోర్టు నిభంధనల ప్రకారం చట్ట పరిధిలో విచారణ నిర్వహించాలని..ఇప్పటి వరకు నిర్వహించిన విచారణ చెల్లదని స్పష్టం చేసింది.
More Stories
Telangana Elections 2023 : నామినేషన్ల స్వీకరణకు పూర్తయిన తగిన ఏర్పాట్లు..
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం..
Chervugattu : శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి Full Story.