మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రాజీనామా కు సిద్ధం…గానీ ఆత్మ గౌరవాన్ని వదులు కోను..

రాజీనామా కు సిద్ధం...గానీ ఆత్మ గౌరవాన్ని వదులు కోను..

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): చావనైనా చస్తా..గానీ ఆత్మ గౌరవాన్ని వదులుకోలేను.. అవసరమైతే రాజీనామాకు కూడా సిద్ధం..ఏం చేస్తవ్..కేసులు పెడతావా.. పెట్టు..జైలుకు పంపుతావా..ఏం చేస్తవ్.. నేను చమటోడ్చి సంపాదించుకున్న ఆస్థులను నాకు కాకుండా చేసి గుంజుకుంటవేమో.. ఫైన్లు వేస్తవేమో చూద్దాం. కొండను తవ్వి ఎలుకను పట్టినవ్..నీ ఫాం హౌజ్ కు రోడ్డు వేయ లేదా..అవి అసైన్డ్ భూములు కావా..ఎవరికి చెప్తవ్..నాకు తెలుసు నీవు పగబడితే వాడిని ఎట్ల ఖతం పట్టిస్తవో.. అయితే నేను మాత్రం గత 19 ఏళ్లుగా నీవే వెంట ఉన్నా..నేను ఎక్కడా తప్పు చేయ లేదు. కాకపోతే మంత్రులను మంత్రులుగా చూడమన్నాను. ఆత్మ గౌరవంతో పని చేస్తున్న వారిని చులకన చేయోద్దన్నాను తప్పా..నేను ఏ నాడు అన్యాయానికి పాల్పడ లేదు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించూ..వాస్తవాలేమిటో తేల తెల్లం అవుతాయి. నేను తప్పు చేసినట్లు తేలితే..ఏ శిక్షకైనా సిద్దమే..అని మాజీ మంత్రి ఈటెల నాగేందర్, సీఎం కేసీఆర్ కు జవాబిచ్చారు. గత నాలుగు రోజులుగా జరుగుతున్న భూ వివాదంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈటెల రాజేందర్ ఖండించారు. తనపై లేనిపోని అభాండాలు వేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని సోమవారం శామిర్పేట్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేనని అన్నారు. అచ్చంపేట వద్ద భూములు కొలవడానికి అక్కడ అత్యధిక సంఖ్యలో పోలీసులను మొహరించి భయానక వాతావరణం కల్పించడం..అధికారం ఉందికదాని..ఏది పడితే అది చేస్తాననడం సరైంది కాదన్నారు. తాను తన ఆస్తులను టీఆర్ఎస్ పార్టీలో చేరక ముందు కొన్నాననే విషయం తెలియదా..పార్టీలో చేరిన అనంతరం తన భార్య, కుమారుడు వ్యాపారం నిర్వహిస్తూ ఆస్తులు కొన్నారన్నారు. నయూం లాంటి హంతకులు భయపడితే భయపడని నేను..ఇప్పడెందుకు భయపడతాను..నేను ఎవరికీ భయపడను..లొంగను అని ధీమాగా చెప్పారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వ లేదని.. అవసరమైన కాగితాలు తెప్పించుకుని తన అడ్వకేట్ల ద్వారా కోర్టును ఆశ్రయిస్తానన్నారు. న్యాయస్థానంలో తాను తప్పకుండా తన నిజాయితీని నిరూపించుకుంటున్నారు. న్యాయస్థానం తనను దోషిగా తేల్చితే ఏ శిక్షకైనా సిద్దమేనని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఒక్కసారి ముఖ్యమంత్రి తనను పిలిచి వివరణ అడిగితే భావుండేదన్నారు. తాను ఎవరికి భయపడనన్నారు. పథకం ప్రకారం స్కెచ్ వేసి ఇదంతా పకడ్బందీగా చేస్తున్నారన్నారు. ఈ విషయంపై తాను ఎవరిని కలువ లేదన్నారు. నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి తప్పలు చేయలేదని..ఇప్పుడు తన క్యారెక్టర్ని దెబ్బతీస్తున్నారన్నారు. ప్రణాలళికాబద్దంగా నాపై విషం చిమ్ముతున్నారన్నారు. అసైన్డ్ భూముల కబ్జా అంటూ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారన్నారు. తాను ఎక్కడా అసైన్డ్ భూములను కబ్జా చేయలేదని.. ఏ విచారణకైన సిద్దమేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు.తాను ఎవరిని మోసం చేయ లేదని..తాను ఎవరికి పడనని..ఎలాంటి విచారణనైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానని ఆయన అన్నారు. ఉద్యమ సమయంలో ఉస్మానియా విద్యార్థులను కాపాడడం కోసం తాను సివిల్ డ్రెస్ లో క్యాంపస్ లోకి వెళ్లి విద్యార్థులను కలిసానన్నారు. ఎన్నళ్లు బతుకుతాం..మానవ సంబంధాలు గుర్తుకు రావాలి కదా..నేనే ఇంతటి వాడినైనానంటే..మీరే కారణం.. కాదనను అంత మాత్రానా నా ఆత్మ గౌరవాన్ని అమ్ముకో లేను. ఇడ్లీ,సాంబార్..గో బ్యాక్ ఉద్యమం..1969 ఉద్యమాలు..ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం మీతోనే ఉన్నాను… మీ వెంటే నడిచాను..నాకు చివరికి ఇచ్చేదీ ఇదా బహుమతి..మీరు చేస్తున్న పని మంచిది కాదు..నేను నా ప్రజల్ని నమ్ముకున్నాను..నా ప్రజలు ఎలా చెబితే అలా నడుచుకుంటా..నా పార్టీ టిక్కెట్ పై గెలిచావని నీవు భావిస్తే..తప్పకుండా రాజీనామా చేసి ప్రజల్లోకి వెళతా..అని ఆయన తన రాజీనామా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. బీ-ఫామ్ ఇవ్వగానే సరిపోదు..పోటీలోని అభ్యర్థి పేస్ వాల్వు, పలుకు బడి,ప్రేమాభిమానాలు కూడా ఉండాలన్నారు. అఫ్పుడే విజయం ఖాయమన్నారు.